కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆ జిల్లాల్లో ప్రత్యేక చర్యలు
ABN , First Publish Date - 2020-03-25T17:17:34+05:30 IST
హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గానూ హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గానూ హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కరోనా కాంటాక్ట్ కేసులు ఉండటంతో ప్రత్యేక జోన్లుగా విభజించారు. కాంటాక్ట్ కేసులు పెరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, కరీంనగర్‌ను రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కొత్తగూడెంను కూడా రెడ్‌జోన్‌గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.