ABN
, First Publish Date - 2020-03-29T13:37:04+05:30 IST
ఎర్రగడ్డ ఛాతి వ్యాధుల ఆస్పత్రిలో 16
హైదరాబాద్, ఎర్రగడ్డ, (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డలోని ఛాతి వ్యాధుల ఆస్పత్రిలో 16 పాజిటివ్... 5 అనుమానిత కరోనా కేసులకు చికిత్స అందిస్తున్నారు. 16 పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. మరొక 5 అనుమానిత కరోనా కేసులకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. గతంలో కరోనా అనుమానిత నమూనాలను పరీక్షల నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపగా శనివారం వాటి ఫలితాలు వచ్చాయని, అందులో నాలుగు అనుమానిత కేసులు నెగెటివ్‌గా తేలడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తెలిపారు. శనివారం తాజాగా కరోనా ఓపీకి 10మంది రాగా వారికి స్ర్కీనింగ్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఉన్న లక్షణాలు కరోనావ్యాధికి సంబంధించినవి కావని చెప్పి పంపించామని ఆయన పేర్కొన్నారు.