కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో పిల్‌

ABN , First Publish Date - 2020-04-15T20:49:22+05:30 IST

కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌ను న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలు చేశారు. ఈ కేసును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం విచారించింది.

కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌: కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఈ పిటీషన్‌ను న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలు చేశారు. ఈ కేసును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయస్థానం విచారించింది. పిటిషన్‌ తరపున వాదనలను సీనియర్‌ కౌన్సిల్‌ మాచర్ల రంగయ్య వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. వలస కూలీలను స్వస్థలాలకు పంపించాలని, ప్రతి కాలనీలో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని, కరోనా నివారణకు జిల్లాలో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని న్యాయస్థానం దృష్టికి ఏజీ తెచ్చారు. రెడ్‌జోన్లు ఎన్ని ఏర్పాటు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. అసలు కరోనా కిట్లు ఎన్ని ఉన్నాయని, ఎన్ని టెస్టులు చేశారని కోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను ఈనెల 20కి  హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-04-15T20:49:22+05:30 IST