గాంధీలో కరోనా పడకలు 150కి పెంపు

ABN , First Publish Date - 2020-03-15T09:02:07+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది.

గాంధీలో కరోనా పడకలు 150కి పెంపు

అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్సలకు పడకలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 2, 7 అంతస్తుల్లో 40 పడకలను ఏర్పాటు చేశారు. అనుమానితులను 2, బాధితులను 7వ అంతస్తులో ఉంచుతున్నారు. వీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘కరోనా పెయింగ్‌’ రూమ్స్‌లో కూడా అనుమానితులను అడ్మిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పడకలను 150కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి 8వ అంతస్తులోని నర్సింగ్‌ స్కూల్‌ను బోయిగూడ నర్సింగ్‌ కాలేజీలోకి తరలించనున్నారు.  

Updated Date - 2020-03-15T09:02:07+05:30 IST