గాంధీభవన్‌కు కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-07-15T22:11:33+05:30 IST

కాంగ్రెస్ నేతలను కరోనా వెంటాడుతోంది. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. కరోనా బారిన పడి వీహెచ్ హనుమంతరావు

గాంధీభవన్‌కు కరోనా దెబ్బ

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను కరోనా వెంటాడుతోంది.  రోజురోజుకు కాంగ్రెస్ పార్టీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. వీహెచ్ హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బలమూర్ వెంకట్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ బాధ్యుల్లో ఇద్దరికి సోకింది. కరోనాతో మాజీ మైనారిటీ సెల్ నాయకులు సిరాజుద్దీన్, టీపీసీసీ కార్యదర్శి నరేందర్ మృతి చెందారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. నేతల మరణాలతో టీపీసీసీ అలెర్ట్ అయింది. వారం రోజులపాటు గాంధీభవన్‌లో కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు. సిబ్బందికి సెలవులిచ్చారు. గాంధీభవన్‌కు తాళాలు కూడా వేశారు.

Updated Date - 2020-07-15T22:11:33+05:30 IST