లాక్‌డౌన్ ఎఫెక్ట్: మహరాష్ట్ర సరిహద్దులో 890 తెలంగాణ వాసులు..
ABN , First Publish Date - 2020-04-01T23:41:35+05:30 IST
మహారాష్ట్రలోని దెగ్లూర్ వద్ద 890 మంది తెలంగాణ వాసులు చిక్కుకు పోయారు. లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కార్మికులు, కూలీలు..

నిజామాబాద్: మహారాష్ట్రలోని దెగ్లూర్ వద్ద 890 మంది తెలంగాణ వాసులు చిక్కుకు పోయారు. లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కార్మికులు, కూలీలు, విద్యార్థులు సొంత గ్రామాలకు కాలి నడకన బయలుదేరారు. అయితే మహారాష్ట్ర సరిహద్దు వీరిని మరాఠా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీరంతా దెగ్లూర్ ఐటీఐలో ఆశ్రయం పొందారు. రెండు రోజులుగా ఆహారం లేకపోవడంతో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు . తమను స్వగ్రామాలకు తరలించాలని వేడుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అధికారులు స్పందించాలని కోరారు.