జిమ్ సెంటర్లపై కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2020-06-04T20:08:42+05:30 IST

కరోనా ప్రభావం లాక్ డౌన్‌తో ఇళ్లల్లోనే వ్యాయామం చేసుకుంటున్నారు.

జిమ్ సెంటర్లపై కరోనా ప్రభావం

హైదరాబాద్: కరోనా ప్రభావం లాక్ డౌన్‌తో ఇళ్లల్లోనే వ్యాయామం చేసుకుంటున్నారు. అయితే తిరిగి జిమ్ సెంటర్లు తెరుచుకుంటే వెళ్లేవారి సంఖ్య తగ్గే అవకాశాలు ఉన్నాయి. కరోనా భయంతో ఇళ్లల్లోనే వ్యాయామం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లో జిమ్‌కు సంబంధించిన వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. వైరస్ భయంతో ఎవరూ జిమ్‌లకు వెళ్లడానికి ఇష్టపడడంలేదు. యోగా, మెడిటేషన్, ఏరోబిక్ ఇవన్నీ చాలా మంది ఇళ్లల్లోనే చేసుకుంటున్నారు.

Updated Date - 2020-06-04T20:08:42+05:30 IST