కరోనా వచ్చిందనే అనుమానంతో ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-28T15:43:18+05:30 IST

జిల్లాలోని తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తనకు కరోనా వచ్చిందేమో అన్న అనుమానంతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరోనా వచ్చిందనే అనుమానంతో ఆత్మహత్య

సూర్యాపేట: జిల్లాలోని తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తనకు కరోనా వచ్చిందేమో అన్న అనుమానంతో ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. కరివిరాల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతను ఆస్పత్రిలో చూపించుకోకుండా.. తనకు కరోనా వ్యాపించిందేమో అని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-28T15:43:18+05:30 IST