కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-03-16T09:58:16+05:30 IST

కరోనా ప్రభావంతో పౌల్ర్టీ రైతులు విలవిలలాడుతున్నారు. రెండు నెలలు కోళ్లను పెంచిన ఓ రైతు, అవి అమ్ముడు పోకపోవడంతో ఆదివారం ఉచితంగా పంపిణీ చేశాడు. కరీంనగర్‌

కరోనా ఎఫెక్ట్‌

మూడు వేల కోళ్లు పంపిణీ 

హుజూరాబాద్‌, మార్చి 15: కరోనా ప్రభావంతో పౌల్ర్టీ రైతులు విలవిలలాడుతున్నారు. రెండు నెలలు కోళ్లను పెంచిన ఓ రైతు, అవి అమ్ముడు పోకపోవడంతో ఆదివారం ఉచితంగా పంపిణీ చేశాడు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌కు చెందిన రవీందర్‌ కోళ్లను అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లగా రూ.10కి ఒక కోడి కొనుగోలు చేస్తామని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెప్పారు. దీంతో రవీందర్‌ గ్రామస్థులందరినీ పిలిచి తన పౌల్ర్టీ ఫాంలోని మూడు వేల కోళ్లను ఉచితంగా అందజేశాడు.

Updated Date - 2020-03-16T09:58:16+05:30 IST