సింగరేణిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-25T22:08:07+05:30 IST

వరుస పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సింగరేణిలో కరోనా కలకలం

మంచిర్యాల జిల్లా: వరుస పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం చెబుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తితో టెన్షన్ పెరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. సింగరేణి సంస్థలో కేసులు ఉండవని అంచనా వేస్తున్న క్రమంలో పలువురు కార్మికులకు పాజిటీవ్ రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. వాస్తవంగా కరోనా విషయంలో సింగరేణి కార్మికులు మొదటి నుంచి తీవ్ర ఆందోళనతో ఉన్నారు. 

Updated Date - 2020-06-25T22:08:07+05:30 IST