సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-06-01T19:57:50+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది.

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం

సంగారెడ్డి: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో వృద్ధిరాలి ఇంటిని పరిసరాలను శానిటైజ్ చేశారు. ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. వృద్ధిరాలి కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.


లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. మూడు రోజులు క్రితం జహీరాబాద్‌లో ఒకరికి, సంగారెడ్డిలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు కరోనా పాటిజీవ్ వచ్చింది. హత్నూరులో అనారోగ్యంతో బాధపడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చనిపోయిన 7 నెలల పాపకు కూడా కరోనా పాజిటీవ్‌గా తేలింది.

Updated Date - 2020-06-01T19:57:50+05:30 IST