ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-05-18T20:20:49+05:30 IST

మహాదేవపురంలో కరోనా కలకలం రేగింది.

ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం

ఖమ్మం జిల్లా: మహాదేవపురంలో కరోనా కలకలం రేగింది. ఈ నెల 14న ముంబయి నుంచి ప్రత్యేక బస్సులో 22 మంది మహాదేవపురం చేరుకున్నారు. వారిలో ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనుమానితుడితోపాటు అతనితో సంబంధం ఉన్న మరో ఏడుగురిని అంబులెన్స్‌లో ఖమ్మం తరలించి, పరీక్షలు చేయించారు. వారిలో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా గ్రీన్ జోన్‌లోకి వెళ్లే సమయంలో మళ్లీ పాజిటీవ్ కేసులు రావడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-05-18T20:20:49+05:30 IST