అంత్యక్రియలకు 40 వేలు డిమాండ్‌

ABN , First Publish Date - 2020-07-28T08:26:31+05:30 IST

కరోనా మహమ్మారితో మృతిచెందిన వారిపట్ల మానవత్వం కొరవడుతోంది. వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారు అందరూ ఉన్నా అనాథల్లా

అంత్యక్రియలకు 40 వేలు డిమాండ్‌

  • పాతిక వేలు ఇస్తామన్నా ముందుకు రాని వైనం

సుభా్‌షనగర్‌, జూలై 27: కరోనా మహమ్మారితో మృతిచెందిన వారిపట్ల మానవత్వం కొరవడుతోంది. వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారు అందరూ ఉన్నా అనాథల్లా శ్మశానానికి చేరుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటనే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని గంగాధర మండలం వెంకటయ్యపల్లె గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి కుటుంబసభ్యులను క్వారంటైన్‌ చేశారు. ఆదివారంనాడు ఆక్సిజన్‌ అందక బెడ్‌పై నుంచి కిందపడి ఆయన మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుటుంబ సభ్యులు హోంక్వారైంటన్‌లో ఉండడంతో.. తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నామని, అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.40 వేలు ఇవ్వాలని మృతుడి కుమారుడిని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని.. రూ.25 వేలు ఇస్తానని చెప్పినా వారు ఒప్పుకోలేదు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని ఔట్‌పోస్టు గదిలో స్ర్టెచర్‌పై ఉంచారు. ఈ విషయాన్ని వృద్ధుడి కుమారుడు.. తహసీల్దార్‌, ఎస్సై దృష్టికి తీసుకెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం రెవెన్యూ అధికారి మున్సిపల్‌ అధికారులతో మాట్లాడిన తర్వాత వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


Updated Date - 2020-07-28T08:26:31+05:30 IST