దీపకాంతులతో వెలిగిపోయిన భారతావని

ABN , First Publish Date - 2020-04-06T02:40:09+05:30 IST

కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమైంది....

దీపకాంతులతో వెలిగిపోయిన భారతావని

హైదరాబాద్: కరోనా‌పై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది.  ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఈ దీపయజ్ఞం కొనసాగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొవ్వొత్తులు వెలిగించారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని కోరుకున్నారు. అటు పల్లెలు, పట్టణాల్లో కూడా యావత్తు ప్రజలు జ్యోతులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు. గో కరోనా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంతో దీప కాంతులతో భారతావని వెలిగిపోయింది.Updated Date - 2020-04-06T02:40:09+05:30 IST