సిద్దిపేట జిల్లా డీఎం, హెచ్ఓ కార్యాలయంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-07-16T02:56:22+05:30 IST

సిద్దిపేట జిల్లా డీఎం, హెచ్ఓ కార్యాలయంలో కరోనా కలకలం

సిద్దిపేట జిల్లా డీఎం, హెచ్ఓ కార్యాలయంలో కరోనా కలకలం

సిద్దిపేట: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా డీఎం, హెచ్ఓ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లా వైద్యాధికారితోపాటు జిల్లా కోవిడ్ అధికారి, ఓ మెడికల్ ఆఫీసర్ తోపాటు మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. హోం క్వారంటైన్ లో బాధితులు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనతో జిల్లా వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-07-16T02:56:22+05:30 IST