కరోనా ఎక్కువగా కళ్ల ద్వారా వస్తుంది

ABN , First Publish Date - 2020-04-14T09:13:48+05:30 IST

‘‘కరోనా వైరస్‌ కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ శాతం కంటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కళ్లను చూసి కరోనా లక్షణాలు అంచనా వేయవచ్చు’’

కరోనా ఎక్కువగా కళ్ల ద్వారా వస్తుంది

  • మాస్క్‌తో నోటికి, ముక్కుకు మాత్రమే రక్షణ
  • కళ్లజోడు ధరించడంతో రక్షణ పొందవచ్చు
  • మ్యాక్సీ విజన్‌ వ్యవస్థాపకుడు ప్రసాద్‌రెడ్డి 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా వైరస్‌ కళ్లు, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ శాతం కంటి నుంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కళ్లను చూసి కరోనా లక్షణాలు అంచనా వేయవచ్చు’’ అని మ్యాక్సీ విజన్‌ కంటి ఆస్పత్రి వ్యవస్థాపకుడు, చీఫ్‌ సర్జన్‌ డాక్టర్‌ కాసు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి కంటి సంబంధ సమస్యలు వస్తాయని, దాని ద్వారా గుర్తిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కళ్లు ఎర్రగా ఉండటం, కళ్ల నుంచి నీరు కారడం, కంటిగుడ్డు వాపు వంటి లక్షణాలు కొందరు కరోనా రోగుల్లో ఉండవచ్చని వివరించారు. చైనాలో కరోనా బారినపడిన వారిలో మూడో వంతు మందిలో ఇలాంటి సమస్యలను వైద్యులు గుర్తించారని తెలిపారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ముక్కు, నోరు, కళ్లను తాకకుండా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. కళ్లజోడు ధరిచండం ద్వారా కొంతవరకు రక్షణ పొందవచ్చని తెలిపారు.

Updated Date - 2020-04-14T09:13:48+05:30 IST