చెన్నూర్‌లో కరోనా కలకలం..

ABN , First Publish Date - 2020-04-05T08:22:00+05:30 IST

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలో శనివారం కలకలం రేగింది. పట్టణంలోని లైన్‌గడ్డకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌, తన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు బంధువులతో కలిసి మార్చి 20న మహారాష్ట్రలోని...

చెన్నూర్‌లో కరోనా కలకలం..

  • క్వారంటైన్‌ స్టాంప్‌తో ఆరుగురి సంచారం

 చెన్నూర్‌, ఏప్రిల్‌ 4: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ పట్టణంలో శనివారం కలకలం రేగింది. పట్టణంలోని లైన్‌గడ్డకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌, తన భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు బంధువులతో కలిసి మార్చి 20న మహారాష్ట్రలోని సిరోంచాకు వెళ్లారు. అక్కడి అధికారులు ఈ నెల 1న వీరి చేతులపై క్వారంటైన్‌ స్టాంపులు వేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. అక్కడి నుంచి తప్పించుకున్న వీళ్లు.. 2వ తేదీనే చెన్నూరు చేరుకున్నారు. శనివారం వీళ్ల చేతుల మీద ఉన్న స్టాంపులను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ నరేందర్‌ ఆధ్వర్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. వైద్య సిబ్బంది సహకారంతో ఆటో డ్రైవర్‌ కుటుంబాన్ని బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించారు. 


Updated Date - 2020-04-05T08:22:00+05:30 IST