బిహారీల నుంచే చేగూర్‌ మహిళకు కరోనా

ABN , First Publish Date - 2020-04-07T09:47:42+05:30 IST

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లో కిరాణా దుకాణం యజమానురాలు మరణించడానికి మర్కజ్‌ లింకే కారణమని తేలింది. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న నలుగురు బీహార్‌ యువకులను పరీక్షలు చేయగా వారిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ

బిహారీల నుంచే చేగూర్‌ మహిళకు కరోనా

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లో కిరాణా దుకాణం యజమానురాలు మరణించడానికి మర్కజ్‌ లింకే కారణమని తేలింది. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న నలుగురు బీహార్‌ యువకులను పరీక్షలు చేయగా వారిలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. చేగూర్‌ గ్రామానికి ఆనుకుని ఉన్న ధ్యాన కేంద్రంలో పని చేస్తున్న నలుగురు బీహారీలు సొంత ఊరికి వెళ్లి మార్చి 19న ఢిల్లీ నుంచి వచ్చే రైల్లో హైదరాబాద్‌కు వచ్చారు. వారు ఢిల్లీలో మర్కజ్‌ మసీదుకు వెళ్లిన బృందంతో కలిసి రైల్లో ప్రయాణించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో చేగూర్‌ ఊరంతా క్వారంటైన్‌లో ఉంది. మొత్తం 91మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారిలో 19మంది మృతురాలి బంధువులు ఉన్నారు. గ్రామంలోని కన్హా శాంతివనంలో వివిధ రాష్ట్రాల కార్మికులు 818 మంది ఉన్నారు. వారందరికీ క్వారంటైన్‌ ముద్రలు వేశారు.

Updated Date - 2020-04-07T09:47:42+05:30 IST