‘సెట్’లన్నీ మరోసారి
ABN , First Publish Date - 2020-10-01T07:41:31+05:30 IST
ఇప్పటి వరకు జరిగిన ‘సెట్’లన్నీ మరోసారి నిర్వహించనున్నారు. కరోనా బారినపడి పరీక్షలకు గైర్హాజరైనవారి కోసం మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు....
కరోనాతో గైర్హాజరైన వారికోసం
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు జరిగిన ‘సెట్’లన్నీ మరోసారి నిర్వహించనున్నారు. కరోనా బారినపడి పరీక్షలకు గైర్హాజరైనవారి కోసం మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో భర్తీకి ఎంసెట్, పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు పీజీ ఈసెట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కూడా గురువారంతో ముగిసింది. అలాగే ఈనెల 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్, 4న లాసెట్ జరగనుంది. కాగా, కరోనా కారణంగా 60 మంది ఎంసెట్‌ను రాయలేకపోయారు. ఇలా పరీక్ష రాయలేని వారు మరికొంత మంది ఉండి ఉంటారని జేఎన్‌టియూ భావిస్తోంది. ఎంసెట్ ఫలితాలు ప్రకటించిన అనంతరం వీరికి పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. అలాగే ఇతర సెట్లు రాయలేకపోయిన వారికీ మరో అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. దీనికోసం ఆయా సెట్ల కన్వీనర్లతో చర్చిస్తోంది. ఈ తేదీలను త్వరలో ప్రకటించాలని భావిస్తోంది.