కరోనా వేళ.. రగిలిన జ్వాల..

ABN , First Publish Date - 2020-04-01T18:42:19+05:30 IST

కూకట్‌పల్లిలోని కైట్లాపూర్‌లోని చెత్త డంపింగ్ యార్డ్‌లో

కరోనా వేళ.. రగిలిన జ్వాల..

హైదరాబాద్: కూకట్‌పల్లిలోని కైట్లాపూర్‌లోని చెత్త డంపింగ్ యార్డ్‌లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి చెత్త డంపింగ్ యార్డు కావడంతో మంటలు వేగంగా వ్యాపించి అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. దాంతో డంపింగ్ యార్డు భవనంతోపాటు చెత్తను తరలించేందుకు ఉపయోగించే రెండు లారీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై కారణాలు తెలియాల్సి ఉందని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని డంపింగ్ యార్డు సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2020-04-01T18:42:19+05:30 IST