ములుగు జిల్లాలో 9 మందికి కరోనా వైరస్
ABN , First Publish Date - 2020-12-20T04:16:22+05:30 IST
ములుగు జిల్లాలో 9 మందికి కరోనా వైరస్

ములుగు కలెక్టరేట్, డిసెంబరు 19: ములుగు జిల్లాలో శనివారం మరో 9 మందికి కరోనా వైరస్ సోకింది. 358 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయగా, ములుగు మండలంలో ఇద్దరికి, ఏటూరునాగారంలో ఒకరికి, వెంకటాపూర్(రామప్ప)లో ఇద్దరికి, గోవిందరావుపేటలో ఇద్దరికి, మంగపేట మండలంలో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు.