గ్రేహౌండ్స్‌కు పాకిన వైరస్‌.. 20 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-08T08:55:05+05:30 IST

గ్రేహౌండ్స్‌కు పాకిన వైరస్‌.. 20 మందికి పాజిటివ్‌

గ్రేహౌండ్స్‌కు పాకిన వైరస్‌.. 20 మందికి పాజిటివ్‌

పోలీస్‌ శాఖను కరోనా భయం వీడటం లేదు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా చెక్‌పోస్టులు, ఆస్పత్రులు, హాట్‌స్పాట్‌ల వద్ద విధులు నిర్వహించిన వారు వైరస్‌ బారినపడ్డారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ విభాగం, పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్నవారు కరోనా బారిన పడ్డారు. తాజాగా గ్రేహౌండ్స్‌లోనూ కరోనా కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేహౌండ్స్‌ విభాగంలో 20 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఇదివరకు ప్రగతిభవన్‌ వద్ద విధులు నిర్వర్తించిన వారు, ఖమ్మం జిల్లాలో కూంబింగ్‌కు వెళ్లివచ్చిన వారికి పాజిటివ్‌గా తేలింది. ఇదిలా ఉంటే పోలీస్‌ శాఖలో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 మంది వైరస్‌ బారిన పడ్డారు. హైదరాబాద్‌ తర్వాత పోలీ్‌సశాఖలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైంది వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోనే. కమిషనరేట్‌ పరిధిలో ఓఎస్డీ సహా 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 20 మంది వరకు ఎస్సైలు వందమందికిపైగా కానిస్టేబుళ్లు వైరస్‌ బారిన పడ్డారు. గత నెల పదవీ విరమణ చేసిన సీపీ డా.వి.రవీందర్‌ వీడ్కోలు పార్టీకి వెళ్లిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-07-08T08:55:05+05:30 IST