కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ షురూ
ABN , First Publish Date - 2020-07-08T08:12:14+05:30 IST
కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ షురూ
ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తలకు వైద్య పరీక్షలు
హైదరాబాద్ సిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియను నిమ్స్ ప్రారంభించింది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల్లో కొందరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ నివేదికను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి పంపించినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. ఈ నమునాలు, ఫలితాల పరిశీలన తర్వాత, ఐసీఎంఆర్ ఎవరిని ఎంపిక చేస్తే వారిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం మొదటి దశ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. ఎంపిక చేసిన ప్రతి ఒక్కరిపై రెండు సార్లు క్లినికల్ ట్రయల్స్ చేయనున్నారు. వ్యాక్సిన్ డోసు ఇచ్చిన తర్వాత వారిని రెండు, మూడు రోజులపాటు రెండుసార్లు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని పర్యవేక్షించనున్నారు.