రైతుల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-05-19T09:25:06+05:30 IST

నెల రోజులవుతున్నా లారీలు రాకపోవడం తో ఎండా, వానలతో ఓపిక నశించిన రైతులు ఆగ్రహంతో ఇనుగుర్తి పెద్దబస్టాండ్‌లో, కేసముద్రంలో రోడ్డుకు

రైతుల ఆగ్రహం

ధాన్యం, మక్కల తరలింపులో జాప్యంపై రాస్తారోకో

మొక్కజొన్నలు దహనం చేసి నిరసన 


కేసముద్రం, మే 18 : నెల రోజులవుతున్నా లారీలు రాకపోవడం తో ఎండా, వానలతో ఓపిక నశించిన రైతులు ఆగ్రహంతో ఇనుగుర్తి పెద్దబస్టాండ్‌లో, కేసముద్రంలో రోడ్డుకు ముళ్లకంపలు పెట్టి సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మొక్కజొన్నలను రోడ్డుపై దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు కొంటామని ప్రకటనలిస్తున్న ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో విఫలమైందని రైతులు ఆరోపించారు. కేసముద్రం విలేజి, ఇనుగుర్తి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులకుపైగా మొక్కజొన్న, ధాన్యం కాంటాలు పూర్తి చేసి లారీలు రాకపోవడంతో నెట్టువేసి ఉంచారు.


లా రీల్లోకి లోడ్‌ చేసే వరకు సరుకుకు రైతులదే బాధ్యత అని నిర్వాహకు లు చెప్పడంతో లారీల కోసం ఎదురుచూస్తూ బస్తాల వద్దనే కాపలా ఉంటున్నారు. నెల రోజులైనా లారీలు రావడంలేదని, ఒకవేళ వచ్చినా బస్తాకు అదనంగా రూ.2 ఇవ్వాలని అడుగుతున్నారని రైతులు ఆరోపించారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో తహసీల్దార్‌ వెం కట్‌రెడ్డి, ఎస్సై సతీష్‌ రైతుల వద్దకు చేరుకొని సముదాయించి సమ స్య పరిష్కరిస్తామని చెప్పి ఆందోళనలను విరమింపజేశారు.

Updated Date - 2020-05-19T09:25:06+05:30 IST