అభివృద్ధి పనులకు సహకరించాలి: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-05-19T09:27:30+05:30 IST
రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రెడ్డిపాలెంలో రోడ్డు నిర్మాణ పనులను సోమవారం

గీసుగొండ, మే 18: రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రెడ్డిపాలెంలో రోడ్డు నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు.
గ్రామంలోని ప్రధాన కూడళ్లలో విస్తరణ పనులకు మార్కింగ్ చేయించారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో అభివృద్ధి ప్రణాళికల చేసి అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అనంతరం మరియపురం వద్ద మహాలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు, సర్పంచ్లు అల్లం బాల్రెడ్డి, గోనె మల్లయ్య, పాక్స్ చైర్మన్లు రడం శ్రీధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.