కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేశాం: కేసీఆర్

ABN , First Publish Date - 2020-11-16T00:57:47+05:30 IST

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. సంవత్సర కాలం పూర్తి జీతంతో పాటు సర్వీసు బెనిఫిట్స్ అందిస్తున్నామని చెప్పారు.

కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేశాం: కేసీఆర్

హైదరాబాద్: కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నెల జీతాలను గతంలో కంటే రెట్టింపు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. సంవత్సర కాలం పూర్తి జీతంతో పాటు సర్వీసు బెనిఫిట్స్ అందిస్తున్నామని చెప్పారు. జూనియర్‌ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తమకు అనువైన మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు.. అవకాశం కల్పించాలన్న కాంట్రాక్ట్‌ లెక్చరర్ల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు. విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యలరైజ్ కోర్టులో కేసుల వల్ల నిలిచిపోయిందని కేసీఆర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-16T00:57:47+05:30 IST