గెస్ట్ లెక్చరర్లను కొనసాగించండి: టీజేసీజీఎల్‌ఏ
ABN , First Publish Date - 2020-09-20T08:17:17+05:30 IST
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఆరేళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని తెలంగాణ జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల

హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ఆరేళ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని తెలంగాణ జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల సంఘం (టీజేసీజీఎల్‌ఏ) కోరింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
1500 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారని, 7 నెలలుగా ఉపాధి లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.