ప్రగతి భవన్‌ నుంచే కుట్ర

ABN , First Publish Date - 2020-05-17T08:48:17+05:30 IST

తెలంగాణలోని నాలుగు జిల్లాలను నాశనం చేసే ఏపీ జీవో 203ను ప్రగతి భవన్‌లోనే రూపొందించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నల్లగొండలో...

ప్రగతి భవన్‌ నుంచే కుట్ర

203 జీవో తయారైంది అక్కడే... ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రైతులకు మద్దతిస్తే అరెస్టా?: పొన్నం


ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: తెలంగాణలోని నాలుగు జిల్లాలను నాశనం చేసే ఏపీ జీవో 203ను ప్రగతి భవన్‌లోనే రూపొందించారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల సీఎంలు రోజూ పది గంటలు ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతుగా ఉండేందుకు వెళితే అరెస్టు చేస్తారా? అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. రాయలసీమ రిజర్వాయర్లన్నీ పోతిరెడ్డిపాడు ద్వారానే నిండుతున్నాయని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 2018-20 విద్యా సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి లేఖ రాశారు. వలస కార్మికులకు రాష్ట్రంలో ఓట్లు లేకపోవడం వల్లే వారిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ ఎంపీ వి.హన్మంతరావు ధ్వజమెత్తారు. 



Updated Date - 2020-05-17T08:48:17+05:30 IST