దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం: ఉత్తమ్

ABN , First Publish Date - 2020-10-07T21:47:37+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘అభివృద్ధిని చూసి కాదు. నన్ను చూసి ఓటేయమనడం

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌దే విజయం: ఉత్తమ్

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘అభివృద్ధిని చూసి కాదు. నన్ను చూసి ఓటేయమనడం’ మంత్రి హరీష్‌రావుకు ఓ స్టాండర్డ్ కామెంట్‌గా మారిందని ఉత్తమ్ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్.. మాదిగ వర్గానికి ఏం చేశారు? అని ప్రశ్నించారు. మూడెకరాల భూమి ఎంత మందికి ఇచ్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.


Read more