దుబ్బాకలో దూకుడు పెంచిన కాంగ్రెస్..

ABN , First Publish Date - 2020-10-28T17:17:59+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది.

దుబ్బాకలో దూకుడు పెంచిన కాంగ్రెస్..

సిద్ధిపేట జిల్లా: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి తానున్నానని, తనకు తోడుగా ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని భట్టి విక్రమార్క పిలుపు ఇచ్చారు. అటు చేగుంట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తల్లి విజయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గెలిస్తే తన భర్త ముత్యం రెడ్డిలానే కుమారుడు కూడా అభివృద్దిని చేపడతారని.. ఓటు వేసి ఆశీర్వదించాలని ఆమె కోరారు.

Updated Date - 2020-10-28T17:17:59+05:30 IST