ధరణి తెచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు: వీహెచ్
ABN , First Publish Date - 2020-12-29T22:11:59+05:30 IST
పీవీ భూ సంస్కరణలు తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ఆయన ఆలోచనలు ఇందిరాగాంధీ అమలు చేశారని గుర్తుచేశారు
హైదరాబాద్: పీవీ భూ సంస్కరణలు తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. ఆయన ఆలోచనలు ఇందిరాగాంధీ అమలు చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ధరణి అని తెచ్చి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కీసరలో ప్రభుత్వం ఇచ్చిన దళితుల భూములను అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు. 2003 వరకు దళితుల మీద ఉన్న రెవెన్యూ రికార్డులు తర్వాత మారి పోయాయన్నారు. జ్యుడీషియరీని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకీ రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు అవుతున్నాయా? అని అడిగారు. దీనిపై జనవరి 4న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు వీహెచ్ వెల్లడించారు.