కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి?: మధుయాష్కి

ABN , First Publish Date - 2020-12-11T22:23:28+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి? అని కాంగ్రెస్ నేత మధుయాష్కి ప్రశ్నించారు

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి?: మధుయాష్కి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటి? అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. ‘సీబీఐ, ఈడీ కేసులకు భయపడి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నారా? కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదనడం స్వార్థరాజకీయాలకు నిదర్శనం. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కుట్రలు. మతం పేరుతో రెచ్చగొట్టేవారికి యువత దూరంగా ఉండాలి’ అని మధుయాష్కి సూచించారు.

Updated Date - 2020-12-11T22:23:28+05:30 IST