కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు

ABN , First Publish Date - 2020-10-01T08:31:09+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు...

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నుంచి సంతకాల సేకరణ ప్రారంభించాలని సూచించారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగే ధర్నాలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ పాల్గొంటారని ఉత్తమ్‌ వెల్లడించారు. 

Updated Date - 2020-10-01T08:31:09+05:30 IST