హైదరాబాద్‌-విజయవాడ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలి: లోక్‌సభలో ఉత్తమ్‌

ABN , First Publish Date - 2020-03-13T16:42:30+05:30 IST

ఢిల్లీ: హైదరాబాద్‌-విజయవాడ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు.

హైదరాబాద్‌-విజయవాడ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలి: లోక్‌సభలో ఉత్తమ్‌

ఢిల్లీ: హైదరాబాద్‌-విజయవాడ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. రెండు రాజధానుల మధ్య హైస్పీడ్‌ ట్రైన్‌ వేస్తే 2గంటల్లో వెళ్లొచ్చన్నారు. ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని.. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌ను అత్యంత వేగవంత ట్రాక్‌ నిర్మాణ ప్రాజెక్టుల్లో చేర్చాలని ఉత్తమ్‌ డిమాండ్ చేశారు.


Updated Date - 2020-03-13T16:42:30+05:30 IST