పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో.203 రద్దుచేయాలి- కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-05-29T20:51:46+05:30 IST

పోతిరెడ్డిపాడు విస్తరణకోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో. 203ను తక్షణం రద్దుచేయాలని కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో.203 రద్దుచేయాలి- కోమటిరెడ్డి

నల్గగొండ: పోతిరెడ్డిపాడు విస్తరణకోసం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో. 203ను తక్షణం రద్దుచేయాలని కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్ణంలోని మామిళ్లగూడెంలో కరోనా వ్యాధితో చనిపోయిన కానిస్టేబుల్‌ దయాకర్‌రెడ్డికుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దయాకర్‌రెడ్డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయం తెలంగాణకు నష్టం కలిగిస్తుందన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంతో నాగార్జున సాగర్‌కు చుక్కనీరు రాదన్నారు. వైఎస్‌ జగన్‌తో కలిసిన కేసీఆర్‌ దక్షణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దక్షణ తెలంగాణను ఎడారి చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని అన్నారు.


కమిషన్లకోసమే గోదావరి నీళ్లను కష్టాలో కలుపుతామంటున్నారని ఆరోపించారు. కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఏడారిగా మారుతుందన్నారు. గందమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లను పక్కనబెట్టారని అందుకే కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు ప్రభుత్వం పై పోరాటానికి మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. జూన్‌ 2 న ప్రాజెక్టుల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకతీతంగా అందరూ ఈ పోరాటంలో కలిసి రావాలన్నారు. ఎస్సెల్బీసీ  సొరంగ మార్గానికి వెయ్యికోట్లు ఇస్తే పూర్తయ్యేదన్నారు నిధులు కేసీఆర్‌ కుటుంబానికి, నీళ్లు అంధ్ర ప్రాంతానికి పోతున్నాయని అన్నారు. పోతిరెడ్డిపాడు ఇష్యూను పక్కదోవ పట్టించేందుకు కొండపోచమ్మ సబురాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కొండ పోచమ్మ ద్వారా కూడా ఒక్క ఎకరానికీ కూడా నీరు ఇవ్వలేదన్నారు. 

Updated Date - 2020-05-29T20:51:46+05:30 IST