కోట్ల అప్పులు తెచ్చి కావాల్సిన వాళ్లకు ఇస్తున్నారు

ABN , First Publish Date - 2020-03-16T09:21:39+05:30 IST

ప్రాజెక్టుల పేరుతో కోట్ల కొద్దీ అప్పులు తెచ్చి.. కావాల్సిన వాళ్లకు ఇస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్‌ శాఖలో కనీస

కోట్ల అప్పులు తెచ్చి కావాల్సిన వాళ్లకు ఇస్తున్నారు

  • ఇరిగేషన్‌ శాఖలో పారదర్శకత లేదు
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల పేరుతో కోట్ల కొద్దీ అప్పులు తెచ్చి.. కావాల్సిన వాళ్లకు ఇస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్‌ శాఖలో కనీస పారదర్శకత కూడా లేదని, ఆసలు ఆ శాఖలో ఏం జరుగుతు న్నదని ప్రశ్నించారు. శాసనసభలో ఆదివారం ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులోనూ పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించారు. ఇటీవలే పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు మంజూరు చేస్తుం టే.. రెండేళ్లక్రితం పనులు పూర్తి చేసిన వారికి మాత్రం బిల్లులు చెల్లించడంలేదన్నారు. అసలు ఆ శాఖలో ఎవరు బిల్లులు తయారు చేస్తున్నారో? ఎవరు ఇస్తున్నారో? ఏమీ అర్థం కావడం లేదన్నారు. ఇరిగేషన్‌కు ఓ పాలసీ అంటూ ఉందా అని ఆయన ప్రశ్నించారు. 


జోకర్‌లా మాట్లాడుతున్నారు

రాజగోపాల్‌రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య.. అభ్యంతరం తెలిపిన భట్టి

మిషన్‌ భగీరథ పథకాన్ని కొన్నిసార్లు ప్రశంసిస్తూ, మరికొన్ని సార్లు విమర్శిస్తూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి జోకర్‌లా మాట్లాడుతున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. దీంతో కోమటిరెడ్డి మాటల తీరుపైనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని ఎర్రబెల్లి వివరణ ఇచ్చుకున్నారు. అనంతరం ఫార్మా సిటీ కాలుష్య సమస్యను భట్టి ప్రస్తావించగా.. కేటీఆర్‌ స్పందించారు. తమ ప్రభుత్వం పర్యావరణహిత ప్రాజెక్టులనే చేపడుతుందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అంశం హైకోర్టులో ఉందని, తీర్పు వచ్చాక దాన్ని పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు సభ జరిగింది.

Updated Date - 2020-03-16T09:21:39+05:30 IST