‘డిసెంబర్ వరకు లాక్‌డౌన్ పొడిగించాలి’
ABN , First Publish Date - 2020-04-29T01:20:52+05:30 IST
లాక్‌డౌన్ డిసెంబర్ వరకు పొడిగించలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

హైదరాబాద్: లాక్‌డౌన్ డిసెంబర్ వరకు పొడిగించలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తన ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. అమెరికా, ఇటలీ అనుభవాలు మనకు రావొద్దనే పొడిగించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. మే 7న లాక్‌డౌన్ ఎత్తి వేస్తే.. అది ప్రజలు ఆమోదిస్తే సంతోషమేనని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు రూ. 10 వేలు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.