ఎల్‌ఆర్‌ఎస్ రద్దు కోరుతూ 30న దీక్ష: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-12-28T23:52:31+05:30 IST
ల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30న దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కరోనా దెబ్బతో ప్రజలు

హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30న దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కరోనా దెబ్బతో ప్రజలు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టలేరని తెలిపారు. నామమాత్రపు ఫీజుతో ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీపై అభిప్రాయాలు చెప్పామన్నారు. కానీ నిర్ణయం సోనియా చేతుల్లో ఉందని చెప్పుకొచ్చారు. ఎవరిని పీసీసీ చీఫ్ చేసినా కలిసి పనిచేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.