దుబ్బాకలో ఓడితే హరీష్‌రావు పదవి పోతుంది: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-10-19T22:46:26+05:30 IST

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్‌రావు మంత్రి పదవి, ఎమ్మెల్యే సీటు ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వేములఘట్ గ్రామంలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

దుబ్బాకలో ఓడితే హరీష్‌రావు పదవి పోతుంది: జగ్గారెడ్డి

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్‌రావు మంత్రి పదవి, ఎమ్మెల్యే సీటు ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వేములఘట్ గ్రామంలో జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ నష్టాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం. వేములఘట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ చూపించాలి. హరీష్‌రావు తన మంత్రి పదవి, సిద్దిపేట టికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ సమస్యల గురించి ప్రశ్నించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే‌ను గెలిపించాలి’ అని ప్రజలను జగ్గారెడ్డి కోరారు.

Updated Date - 2020-10-19T22:46:26+05:30 IST