కరోనా నేపథ్యంలో కేసీఆర్ సర్కార్‌కు జగ్గారెడ్డి కొత్త డిమాండ్స్
ABN , First Publish Date - 2020-07-18T20:23:07+05:30 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో విస్తరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొత్త డిమాండ్లు ఉంచారు.

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో విస్తరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొత్త డిమాండ్లు ఉంచారు. శనివారం నాడు ‘స్పీక్ అప్ తెలంగాణ’ పేరుతో కోవిడ్-19పై తాము డిజిటల్ ఉద్యమం చేపట్టామన్నారు.
జగ్గారెడ్డి డిమాండ్స్ ఇవీ..
- కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి
- పేదలకు ఉచిత వైద్యం అందించాలి
- ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫీజులను నియంత్రించాలి
- యాభై శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
- హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని హోటల్స్‌లో 50 రూమ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. వాటిని హోమ్ క్వారంటైన్‌లుగా మార్చాలి
- రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలి
- కోవిడ్ మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషిషియా ఇవ్వాలి
- ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు 50 లక్షలు ఎక్స్‌గ్రేషిషియా ఇవ్వాలి
- ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచాలి.. ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని సర్కార్‌ను జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
అదే విధంగా..
‘హార్ట్ అటాక్ వంటి ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లిన వారికి కూడా కరోనా అనుమానంతో వైద్యం చేయడం లేదు. దాంతో కరోనా యేతర ఆరోగ్య సమస్యలతో వెళుతున్న వారికి వైద్యం సకాలంలో అందక మరణిస్తున్నారు. కరోనాకు మందు వచ్చే వరకు ప్రజలకు విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి. కిరాయిదారుల ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలి. ఇంటి పన్నులు పూర్తిగా రద్దు చేయాలి. గాంధీ హాస్పిటల్‌కు 3000కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలి. ప్రజలంతా మరణిస్తే ప్రాజెక్టులు కట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రజల ప్రాణాలు ముఖ్యం’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.