గాంధీభవన్‌లో పీవీ శతజయంతి కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2020-07-19T19:02:46+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో పీవీ శతజయంతి కమిటీ సమావేశమైంది.

గాంధీభవన్‌లో పీవీ శతజయంతి కమిటీ సమావేశం

హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్‌లో పీవీ శతజయంతి కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత వి.హెచ్, గీతారెడ్డి, దాసోజు శ్రావణ్, సీతక్క, మల్లు రవి, హర్కర వేణుగోపాల్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పీవీ శతజయంతి కార్యక్రమాలపై సమావేశంలో నిశితంగా చర్చించారు.


ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. జులై 24న పీవీ మొదటి ఆర్థిక సంస్కరణలపై ప్రసంగం చేసిన రోజు అని తెలిపారు. జూమ్ యాప్ ద్వారా 1000 మంది పాల్గొనేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరా భవన్‌లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రసంగాలు వినేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. జూమ్ యాప్ ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ మంత్రులు చిదంబరం, జై రాం రమేష్‌లు మాట్లాడతారని ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-07-19T19:02:46+05:30 IST