వరంగల్ జిల్లాలో మహిళలపై కాంగ్రెస్ నేతల దాడి

ABN , First Publish Date - 2020-04-26T21:23:49+05:30 IST

ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ వీరంగం వేశారు.

వరంగల్ జిల్లాలో మహిళలపై కాంగ్రెస్ నేతల దాడి

వరంగల్: ఖానాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ వీరంగం వేశారు. అతని తమ్ముడు సూర్యప్రకాశ్‌తో కలిసి ఓ కుటుంబంపై దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేశారు. ఖానాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటప్రసాద్, సూర్యప్రకాశ్ ఇద్దరూ కలిసి అతని మేనల్లుడు వెంకటరత్నం ఇంటికి వెళ్లి.. వాళ్లకున్న ఆర్థిక లావాదేవీలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో వెంకటప్రసాద్, సూర్యప్రకాశ్‌లు కలిసి ఆ కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఇరువర్గాలకు చెందినవారు ఖానాపూర్ పోలీస్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేశారు. గాయపడిన మహిళలకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-04-26T21:23:49+05:30 IST