రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం: సంపత్‌

ABN , First Publish Date - 2020-03-02T18:43:33+05:30 IST

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్‌ నేత సంపత్‌‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం: సంపత్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్‌ నేత సంపత్‌‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని తెలిపారు. కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తేయాలన్నారు. అలాగే టమాటాకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర, విత్తన సబ్సిడీ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పనిముట్లను వదిలేసి.. కమీషన్లు వస్తాయనే ట్రాక్టర్ల పంపిణీపై దృష్టి పెట్టారని ఆరోపించారు. రైతుల సమస్యలపై ట్వీట్‌ చేసినా కేసీఆర్‌, కేటీఆర్‌ స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్, ఎంపీ రంజిత్‌ కోసం చికెన్ కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్.. రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని సంపత్‌ ప్రశ్నించారు.


Updated Date - 2020-03-02T18:43:33+05:30 IST