కాంగ్రెస్‌కు కమ్లీమోత్యానాయక్‌ రాజీనామా.. నేడు టీఆర్ఎస్‌లోకి..

ABN , First Publish Date - 2020-05-17T16:31:11+05:30 IST

తన రాజీనామా పత్రాన్ని..

కాంగ్రెస్‌కు కమ్లీమోత్యానాయక్‌ రాజీనామా.. నేడు టీఆర్ఎస్‌లోకి..

రంగారెడ్డి : కడ్తాల్‌ ఎంపీపీ కమ్లీమోత్యానాయక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని డీసీసీ ఆధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డికి పంపినట్లు ఆమె వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితురాలినై, మండలాభివృద్ధిని కాంక్షించి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు.

Updated Date - 2020-05-17T16:31:11+05:30 IST