తెలంగాణ సెంటిమెంట్‌తో పబ్బం గడుపుకోవడం కాదు...: పొన్నం ప్రభాకర్
ABN , First Publish Date - 2020-08-12T18:53:44+05:30 IST
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేసీఆర్ స్టాండ్ ఏంటి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

కరీంనగర్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేసీఆర్ స్టాండ్ ఏంటి అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ పీఎంను పిలిచి భోజనం పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాలసీమ చేస్తామని అనలేదా? అని నిలదీశారు. కృష్ణా జలాల వ్యవహారంపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్తారా లేదా? అని ఆయన అడిగారు. కాంగ్రెస్ నో, బిజేపీనో, ఆంధ్రా పాలకులనో దూషించడం కాదని.. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో పబ్బం గడుపుకోవడం కాదని... చుక్క నీరు పోయినా.. కేసీఆర్ దే బాధ్యత అని పొన్నం ప్రభాకర్ అని వ్యాఖ్యానించారు.