మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం: జీవీరెడ్డి
ABN , First Publish Date - 2020-05-18T14:18:09+05:30 IST
మేం ప్రైవేటీకరణకు వ్యతిరేకం: జీవీరెడ్డి

హైదరాబాద్: పడిపోయిన ప్రభుత్వ షేర్లను ప్రైవేటు సెక్టార్‌కు అమ్మేస్తామంటున్నారని...షేరు ధర తగ్గాక అమ్మితే ప్రయోజనమేంటి అని కాంగ్రెస్ నేత జీవీరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీతో ఎవరి కడుపూ నిండదని విమర్శించారు. వలస కూలీలు అడుగుతున్న రవాణా సౌకర్యం కల్పించలేకపోతున్నారని...వాళ్లని వందల కిలోమీటర్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని జీవీరెడ్డి స్పష్టం చేశారు.