2న కృష్ణా పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ జలదీక్షలు

ABN , First Publish Date - 2020-06-01T22:32:18+05:30 IST

కృష్ణా పెండింగ్ ప్రాజెక్టుల వద్ద మంగళవారం కాంగ్రెస్ జలదీక్షలు చేపట్టనున్నారు. నల్గొండ జిల్లా ఎస్‌ఎల్బీసీ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి‌, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ దీక్ష చేస్తారు

2న కృష్ణా పెండింగ్ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ జలదీక్షలు

హైదరాబాద్: కృష్ణా పెండింగ్ ప్రాజెక్టుల వద్ద మంగళవారం కాంగ్రెస్ జలదీక్షలు చేపట్టనున్నారు. నల్గొండ జిల్లా ఎస్‌ఎల్బీసీ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి‌, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ దీక్ష చేస్తారు. పాలేరు జలాశయం వద్ద భట్టి విక్రమార్క, సీతక్క, పొడెం వీరయ్య, బలరాం నాయక్ దీక్ష చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. రేపు లక్ష్మీదేవిపల్లి పంప్‌హౌస్ వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జలదీక్ష చేయనున్నారు. మంగళవారం ఎల్లూరు జలాశయం వద్ద నాగం జనార్దన్‌రెడ్డి, కరివేన వద్ద చిన్నారెడ్డి జలదీక్ష చేస్తారు. నెట్టెంపాడు జలాశయం వద్ద సంపత్‌కుమార్‌, కల్వకుర్తి వద్ద వంశీచంద్‌రెడ్డి దీక్ష చేస్తారని కాంగ్రెస్ తెలిపింది.

Updated Date - 2020-06-01T22:32:18+05:30 IST