కేసీఆర్ తలుచుకుంటే జగన్‌ని పిలిచి చెప్పొచ్చు: చిన్నారెడ్డి

ABN , First Publish Date - 2020-05-13T16:54:02+05:30 IST

తెలంగాణలో కరోనా నివారణలో ఉంటే ఏపీ సీఎం జగన్‌ నీళ్లు దోచుకునే పనిలో పడ్డారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్ తలుచుకుంటే జగన్‌ని  పిలిచి చెప్పొచ్చు: చిన్నారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా నివారణలో ఉంటే ఏపీ సీఎం జగన్‌ నీళ్లు దోచుకునే పనిలో పడ్డారని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మండిపడ్డారు. అందరికంటే ముందు స్పందించాల్సిన సీఎం కేసీఆర్..ఆలస్యంగా మేల్కొన్నారని చెప్పారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య అవగాహన ఉందన్నారు. కేసీఆర్ తలుచుకుంటే జగన్ మోహన్ రెడ్డిని పిలిచి చెప్పొచ్చన్నారు. కేసీఆర్..దక్షిణ తెలంగాణకు కూడా సీఎం అని గుర్తుపెట్టుకోవాలన్నారు. 

Read more