జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2020-12-29T04:29:23+05:30 IST
జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

జనగామ కల్చరల్, డిసెంబరు 28: జిల్లా వ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని 1885 డిసెంబరు 28న స్థాపించారని, భారతదేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు శ్రమించారని అన్నారు. మహాత్మాగాంధీ, బీఆర్.అంబేద్కర్ లాంటి అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదెపాక సరిత, మునిసిపల్ మాజీ చైర్మన్లు ఎర్రమల్ల సుధాకర్, వేమళ్ల సత్యనారాయణరెడ్డి, అధికార ప్రతినిధులు మేడ శ్రీను, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.