‘పోలింగ్ తగ్గడానికి టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలే కారణం’
ABN , First Publish Date - 2020-12-02T00:45:25+05:30 IST
‘పోలింగ్ తగ్గడానికి టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలే కారణం’

హైదరాబాద్: పోలింగ్ తగ్గడానికి టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. మతపరమైన అంశాల ప్రస్తావనతో ఓటర్లు ఉత్సాహం చూపలేదన్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి ఎస్‌ఈసీ, ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు అనిపించడం లేదన్నారు.